babu baga busy review

సినిమా :బాబు బాగా బిజీ
నటీనటులు : అవసరాల శ్రీనివాస్ , శ్రీ ముఖి , మిస్సి చక్రవర్తి ,తేజస్విని ,పోసాని , ప్రియా దర్శి
దర్శకుడు : నవీన్ మేడారం
నిర్మాత : అభిషేక్
విడుదల :05 మే 2017
చుసిన థియేటర్ :సరస్వతి పిక్చర్ ప్యాలస్
సంగీతం : సునీల్ కశ్యప్
నిడివి :125 నిమిషాలు

అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా మంచి విజయాలను అందుకుంటూ .. నటుడిగా అందరి మన్ననలు పొందుతూ వస్తున్నాడు . అలాంటి సమయంలో అవసరాల నటించిన బాబు బాగా బిజీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది . విడుదలకు ముందే అడల్ట్ కంటెంట్ అంటూ ఏ సర్టిఫికెట్ పొంది యూత్ లో మంచి క్కురియాసిటీ సీరియెట్ చేయటం జరిగింది . భారీ మొత్తం లో బిజినెస్ కూడా జరిగింది . ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారో చూద్దాం
కథ:
అమ్మాయిలతో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ అదే జీవితం అనుకోని చివరకు అది కాదు జీవితం అని తెలుసుకుని తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి గురించి చెప్పాలని అవసరాల శ్రీనివాస్ బయలుదేరుతాడు . అసలు మాధవ్ (అవసరాల ) ఎందుకు ఆలా అమ్మాయి లతో ఎంజాయ్ చేయటం మొదలు పెట్టాడు . అని కథ స్టార్ట్ అవుతుంది . చిన్నప్పుడు అతడు అతని స్నేహితులతో పెరిగిన వాతావరణం . చుసిన సినిమాలు అతని జీవితం మీద ప్రభావం చూపుతాయి .
ఒకానొక సమయంలో మారి పెళ్లి చేసుకుందాం అని నిర్ణయించుకుంటాడు . కానీ ఆ నిర్ణయం మీద అతను నిలబడలేక పోతాడు . నిశ్చితార్థం కుదిరిన తర్వాత కూడా ఇంకొకరితో సంబంధం పెట్టుకుంటాడు . చివరకు అసలు ఇలాంటి వ్యక్తి మారాడా? లేదా? మారితే ఎలాంటి సందర్భాలలో మారాడు ? అనేది ఈ చిత్రం కథ..
విశ్లేషణ :
ఈ చిత్రం హిందీ చిత్రం యొక్క మాతృక . ఇలాంటి కథలు వినటానికి బాగుంటాయి తీయటం కష్టం . ఏదో నాలుగు డబల్ మీనింగ్ ఉన్న డైలాగ్స్ ఉంటె సినిమా ఆడిస్తుంది అనుకుని సినిమా తీస్తే బాబు బాగా బిజీ లా ఉంటుంది సినిమా. దర్శకుడు ఏమి చెప్పాలనుకున్నాడో ఎవరికి అర్ధం కాదు . ఒకసారి 1997 అంటాడు ఇంతలో 201 అంటాడు . మల్లి 2007 అంటాడు . అసలు కథ ఎక్కడినుండి ఎక్కడికి పోతుంది రా బాబు అని సామాన్య ప్రేక్షకుడు సైతం విసిగిపోయేలా కథను ముక్కలు ముక్కలు గా చూపించాడు . అసలు స్క్రీన్ ప్లే కుదరలేదు . సంగీతం పర్వాలేదు అనిపించింది .. సుద్దలా అశోక్ తేజ రాసిన పసి హృదయం పాట చాలా బాగుంది .
కెమెరా పెద్ద గొప్పగా ఏమి లేదు . అడల్ట్ కంటెంట్ తీసుకున్నప్పుడు దానికి క్లైమాక్స్ మెసేజ్ ఉండేలా కోరుకుంటారు తెలుగు ప్రేక్షకులు . అది పూర్తి గా లేదు .అవసరాల తన పాత్రలో ఒదిగి పోగా .. మిగతా హీరోయిన్స్ అలా వచ్చి ఇలా వెళ్తుంటారు . ఎక్కడ హార్ట్ టచ్ చేసిన సన్నివేశాలు లేవు .

ప్లస్ లు:
అవసరాల శ్రీనివాస్ నటన
పర్వాలేదనిపించిన పాటలు
యూత్ కి కావాల్సిన మసాలా ఉండటం

మైనస్ లు :
స్క్రీన్ ప్లే
కథ ఎక్కడ ప్రేక్షకులకి కనెక్ట్ కాకపోవటం

రేటింగ్ :2.5/5

చివరిగా : బాబు దగ్గర అనుకున్నంత ఊపు లేదు ..
విశ్లేషకుడు : నరేంద్ర కుమార్ ఏనుగంటి

Advertisements

free to comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s