ప్రభాస్ బాహుబలి మూవీ రివ్యూ

సినిమా : బాహుబ‌లి – ది కంక్లూజ‌న్

స‌మ‌ర్ప‌ణ‌: కె.రాఘ‌వేంద్ర‌రావు

కథ : వి.విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌

మాటలు : సీహెచ్‌.విజ‌య్‌కుమార్ – జి.అజ‌య్‌కుమార్‌

వస్త్రాలంకరణం: ర‌మా రాజ‌మౌళి – ప్ర‌శాంత్ త్రిపుర‌నేని

వీఎఫ్ఎక్స్‌: క‌మ‌ల్ క‌ణ్ణ‌న్‌

సౌండ్ డిజైన్‌: పీఎం.స‌తీష్ – మ‌నోజ్ ఎం.గోస్వామి

పోరాటాలు : కింగ్ సోల్మ‌న్ – లీ విట్టాక‌ర్ – కేచ‌.కంపక్తీ

నృత్యం : ప్రేమ్ ర‌క్షిత్ – శంక‌ర్‌

ఛాయాగ్రహణం: కెకె.సెంథిల్‌కుమార్‌

సంగీతం: ఎంఎం.కీర‌వాణి

కూర్పు: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు

నిర్మాత‌లు: శోభు యార్ల‌గ‌డ్డ – ప్ర‌సాద్ దేవినేని

కథనం:ద‌ర్శ‌క‌త్వం: ఎస్ఎస్‌.రాజ‌మౌళి

సెన్సార్ రిపోర్ట్‌: యూ/ ఏ

నిడివి: 170 నిమిషాలు

విడుదల: 28 ఏప్రిల్‌, 2017

చూసిన థియేట‌ర్: సత్యం -అమీర్ పేట హైదరాబాద్

క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడ‌న్న సమాధానం కోసం రెండు సంవత్సరాల ప్రపంచపు సినీ ప్రేక్షకుల నిరీక్షణ  ఫలించింది. ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానం దొరికే రోజు రానే వ‌చ్చింది. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ సినిమా ఈ రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 9 వేల స్క్రీన్ల‌లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ద‌శ‌దిశ‌లా చాటిచెప్ప‌న ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రెండో భాగం తో ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టించాడో అన్న ఆస‌క్తి అంద‌రిలోను ఉంది. ఆకాశాన్ని సైతం మించిపోయిన అంచ‌నాల‌కు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో సినిమా చూపిస్తా మామ సమీక్షలో చూద్దాం ..

కథ :

బాహుబ‌లి1 లో ముగింపు అయిన అమ‌రేంద్ర బాహుబ‌లి(ప్ర‌భాస్‌)ని విజ‌య‌ద‌శ‌మికి ప‌ట్టాభిషేకం చేయాల‌న్న శివ‌గామి ఆదేశంతో బాహుబ‌లి 2 స్టార్ట్ అవుతుంది. అమ‌రేంద్ర బాహుబ‌లి దేశాట‌న నిమిత్తం బ‌య‌ట‌కు వెళతాడు. ఈ క్ర‌మంలోనే కుంత‌ల దేశ యువ‌రాణి దేవ‌సేన (అనుష్క‌)ను చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. పిండారిల‌పై యుద్ధం చేసి కుంత‌ల రాజ్యాన్ని కాపాడ‌డంతో దేవ‌సేన అమ‌రేంద్రుడి ప్రేమ‌లో ప‌డుతుంది. ఈ స్టోరీ ఇలా ఉంటే తాను రాజు కాలేద‌ని కోపంతో ర‌గులుతున్న భ‌ళ్లాల‌దేవుడు (రానా ద‌గ్గుపాటి), అత‌డి తండ్రి బిజ్జిల‌దేవుడు (నాజ‌ర్‌) అమ‌రేంద్రుడు దేవ‌సేన ప్రేమ‌లో ఉన్న విష‌యం తెలుసుకుంటారు. ఇదే అద‌నుగా దేవ‌సేన త‌న‌కు కావాల‌ని, ఆమెతో త‌న పెళ్లి చేయాల‌ని త‌న త‌ల్లి శివ‌గామి (ర‌మ్య‌కృష్ణ‌)ను కోర‌డంతో ఆమె ఓకే చెపుతుంది.

 

అయితే దేవ‌సేన మాత్రం రానాను పెళ్లి చేసుకోవాల‌ని శివ‌గామి పంపిన ఆదేశాన్ని ధిక్క‌రిస్తుంది. త‌న ఆదేశాన్ని ఆమె ధిక్క‌రించింద‌న్న ఆగ్ర‌హంతో శివ‌గామి దేవ‌సేన‌ను బందీ చేసి తీసుకురావాల‌ని అమ‌రేంద్ర బాహుబ‌లికి వ‌ర్త‌మానం పంపుతుంది. ఆమె గౌర‌వానికి భంగం క‌లిగించ‌న‌న్న మాట‌తో ఆమెను మ‌హిష్మ‌తికి తీసుకువ‌స్తాడు. భ‌ళ్లాలుడితో ఆమెకు వివాహం చేయాల‌ని త‌ల‌చిన శివ‌గామికి ఆమె అమ‌రేంద్రుడి ప్రేమ‌లో ఉంద‌ని తెలుసుకుంటుంది. ఈ క్ర‌మంలోనే అమ‌రేంద్ర బాహుబ‌లి కూడా దేవ‌సేన త‌న‌దే అన‌డంతో అప్పుడు శివ‌గామి రాజ్యం కావాలా ? దేవ‌సేన కావాలా ? తేల్చుకోమంటుంది. అప్పుడు అత‌డు దేవ‌సేనే కావాలంటాడు. అప్పుడు భ‌ళ్లాలుడిని మ‌హిష్మ‌తి రాజుగా ప‌ట్టాహిషిక్తుడిని చేస్తుంది. అమ‌రేంద్రుడిని సైన్యాధిప‌తిని చేసి దేవ‌సేన‌తో పెళ్లి చేస్తుంది.

 

అమ‌రేంద్రుడిని ఎలాగైనా అంత‌మొందించాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోన్న భ‌ళ్లాలుడు అత‌డిపై త‌న తండ్రి బిజ్జ‌ల‌దేవుడి ద్వారా త‌న త‌ల్లి శివ‌గామికి లేనిపోని అపోహ‌లు క‌ల్పించి రాజ్యం నుంచి బ‌హిష్క‌రిస్తారు. చివ‌ర‌కు శివ‌గామి క‌ట్ట‌ప్ప‌ను అమ‌రేంద్ర బాహుబ‌లిని చంపాల‌ని ఆదేశించ‌డంతో క‌ట్ట‌ప్ప అమ‌రేంద్రుడిని చంపుతాడు.

త‌న తండ్రికి జ‌రిగిన అన్యాయంపై అమ‌రేంద్రుడి కుమారుడు మ‌హేంద్ర బాహుబ‌లి ఎలా ప‌గ‌తీర్చుకున్నాడు ? త‌న త‌ల్లి దేవ‌సేన కోరిక తీర్చాడా ? భ‌ళ్లాలుడిని ఎలా సంహ‌రించి ? మ‌హిష్మ‌తికి రాజ‌య్యాడు ? అన్న‌దే బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ స్టోరీ.

విశ్లేషణ: ఫస్టాఫ్ విశ్లేష‌ణ‌కు వ‌స్తే ప్రారంభంలో ప్ర‌భాస్ ప‌ట్టాభిషిక్తుడు కావాల‌న్న శివ‌గామి కోరిక‌తో క‌థ ప్రారంభ‌మ‌వుతుంది. ఆ త‌ర్వాత కుంత‌ల రాజ్యంలోకి ప్ర‌భాస్ ఎంట‌ర్ అయ్యాక ఆమె ప్రేమ‌ను పొందేందుకు క‌ట్ట‌ప్ప‌తో క‌లిసి చేసే డ్రామాలో ల‌వ్ ఫీల్ పెద్ద‌గా క‌నెక్ట్ కాక‌పోయినా క‌ట్ట‌ప్ప చేసిన కామెడీ కొంత వ‌ర‌కు ఓకే అనిపించింది. ర‌మ్య‌కృష్ణ‌ను కాపాడే సీన్‌తో ప్ర‌భాస్ ఎంట్రీ సీన్ బాగుంది.

కుంత‌ల రాజ్యంపై పిండారిలు దండ‌యాత్ర చేయ‌డం, ఆ దండ‌యాత్ర‌ను ప్ర‌భాస్ తిప్పికొట్ట‌డం బాగుంది. ఈ టైంలో వ‌చ్చే యుద్ధం సినిమా మేజ‌ర్ హైలెట్ల‌లో ఒక‌టిగా నిలిచింది.

న‌టీన‌టుల్లో ప్ర‌భాస్ సినిమాకు ప్రాణం పెట్టి న‌టించాడురాజ‌మౌళి అంచ‌నాల‌కు త‌ల‌ద‌న్నేట్టు ప్ర‌భాస్ న‌ట‌న ఉంది. ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్ల‌లో రాజ‌సం ఉట్టిప‌డింది. తెలుగు చిత్ర సీమ‌లో ప‌రిపూర్ణ ప్ర‌తినాయ‌కుడిగా త‌న‌కిచ్చిన బాధ్య‌త‌ను సంపూర్ణంగా భ‌ళ్లాలుడి క్యారెక్ట‌ర్‌కు రానా న్యాయం చేశాడు. వాస్త‌వంగా చూస్తే రాజ‌మౌళి ప్ర‌భాస్ మీద కాన్‌సంట్రేష‌న్‌తో పోలిస్తే రానా మీద ఎందుకు కాన్‌సంట్రేష‌న్ చేయ‌లేద‌న్న సందేహం క‌లుగుతుంది.

అనుష్క క్యారెక్ట‌ర్‌లో అందం, ఆత్మ‌గౌవ‌రం, అభిన‌యం, అహంకారం, పౌరుషం, వీర‌త్వం, బాధ‌, భావోద్వేగం ఇలా ప్ర‌తి అంశంలోనే ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ క‌ట్టిప‌డేసింది రాజసం, ద‌ర్పం, రాజ‌నీతి, పొగ‌రు, బాధ ఏ విధంగా అయితే చూపించిందో ప్ర‌భాస్ త‌న మాట‌ను ఎదిరించాడ‌న్న ద్వేషం, కోపంలోను ఆకాశాన్నంటే న‌ట‌న క‌న‌పరిచింది.

బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప చంపాక తాను చేసిన త‌ప్పును తెలుసుకున్న‌ప్పుడు త‌ల్లిగా త‌న మ‌మ‌కారాన్ని క‌ళ్ల‌తోనే వ్య‌క్తం చేసిన తీరు హ్యాట్సాఫ్‌. అది ఆమె ఒక్క‌రికే సాధ్య‌మా అన్న‌ట్టుగా ఉంది. క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని చంపే సీన్‌తో పాటు బాహుబ‌లిని చంపి వ‌చ్చాక శివ‌గామిని ఎదిరించి ఆమెతో నిజం చెప్పే సీన్‌లో అత‌డి న‌ట‌న అద్భుతం.

బిజ్జ‌ల‌దేవుడిగా ప్ర‌భాస్‌పై ర‌మ్య‌కృష్ణ‌కు లేనిపోని కుతంత్రాలు నూరిపోస్తూ ద్వేషం పెంచే ఓ శ‌కుని టైప్ క్యారెక్ట‌ర్‌లో నూటికి నూరు శాతం న్యాయం చేశాడు.  సినిమాలో యాక్ష‌న్ స‌న్నివేశాల్లో ఫ‌స్టాఫ్‌లో వ‌చ్చే పిండారిలీ యుద్ధంతో పాటు క్లైమాక్స్‌లో వ‌చ్చే రానా , ప్ర‌భాస్ వార్ హైలెట్ అయ్యాయి

ప్లస్ లు :

రాజమౌళి దర్శకత్వం

రమ్య కృష్ణ ,ప్రభాస్ నటన

యుద్ద సన్నివేశాలు

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

నిర్మాణ విలువలు

మైనస్ లు :

రానా క్యారేక్టర్ చాలా తగ్గటం

రానా కి పెళ్లి అయ్యిందా? చనిపోయింది అతడి కొడుకేనా అనే కొన్ని సందేహాలు అలానే ఉంచటం .

రేటింగ్ : 4.25/5

చివరిగా : మేము తెలుగు వాళ్ళం. మా సినిమా రేంజ్ బాహుబలి అని కాలర్ ఎగరేసి చెప్పొచ్చు .

 

Advertisements

free to comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s