zee tv apsara awards stills

విలక్షణతను ఆవిష్కరించిన అప్సర అవార్డ్స్

మీడియా, ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఇతర రంగాల్లో ప్రత్యేక ప్రతిభ కనబరుస్తూ రాణిస్తున్న మహిళలను అప్సర అవార్డ్స్ పేరిట సత్కరించే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జీ తెలుగు. తొలి సంవత్సరం విజయాన్నందుకొని, మూర్తీభవించిన స్త్రీ సౌందర్యం, విజయాలకు పురస్కారాలు, కళ్లు మిరుమిట్లుగొలిపే ఆటపాటలతో ఏప్రిల్ 9వ తేదీ ఆదివారం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టుడియో ఏడెకరాలలో అంగరంగ వైభవంగా జరిగింది అప్సర అవార్డ్స్-2017. కళాతపస్వి కె.విశ్వనాథ్, అలనాటి నటీమణి షావుకారు జానకి, స్వరసరస్వతీ పుత్రిక వాణీ జయరామ్ లను సన్మానించడంతో కార్యక్రమం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ అతిథిగా విచ్చేశారు. హైదరాబాద్ నగర అదనపు కమిషనర్ స్వాతి లక్రా, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ సారథి మిథాలీ రాజ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రేక్షకులు తమ అభిమాన తారలకు ఓటువేసే ప్రక్రియలో భాగంగా దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా జీ తెలుగు, ఫేస్ బుక్ సంయుక్త నిర్వహణలో ప్రత్యేక Facebook Messenger www.me/zeeteluguద్వారా Voting BOT నిర్వహించబడింది. ప్రతి అభ్యర్థి పేరుతో పాటుగా పోలైన ఓట్ల శాతాన్ని లైవ్ పోలింగ్ లో అందించడం ఇదే తొలిసారి. అంతేకాకుండా, యూట్యూబ్ ప్రేక్షకులకు“మహాతల్లి”గా చిరపరిచితురాలైన జాహ్నవి (తెలుగులో డిజిటల్ కంటెంట్ క్రియేటర్) సహాయంతో నిర్విరామంగా 3 గంటల పాటు జీ తెలుగు అప్సర అవార్డ్స్-2017 పింక్ కార్పెట్ ను Facebook LIVEలో అందించడం కూడా దక్షిణ భారతదేశంలోనే తొలిసారి కావడం అభినందనీయం.

“జీ తెలుగులో సంయుక్తంగా ఆసక్తికరమైన అప్సర అవార్డ్స్-2017 కార్యక్రమానికి పనిచేయడం ఎంతో ఉపయుక్తమైంది” అని హెడ్ ఆఫ్ మీడియా పార్టనర్ షిప్ సౌత్ ఫేస్ బుక్ అంకుర్ మెహ్రా ఆనందాన్ని వ్యక్తంచేశారు.

జీ తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ గూడూరు మాట్లాడుతూ “తొలిసారిగా కలిసిపనిచేసిన ఫేస్ బుక్ ఎంతో సహకారాన్ని అందించడం సంతోషదాయకం” అన్నారు. హుందాతనం, సౌందర్యం కలబోసుకున్న నటీమణుల రాకతో ఈ కార్యక్రమం జగజ్జేయమానమైంది. ఆదాశర్మ, ప్రగ్య జైశ్వాల్, సాయేషా, మెహ్రీన్ కౌర్, నోరా ఫతేతో పాటు మిస్ ఆంధ్రప్రదేశ్, ప్రపంచ మిస్ ఆసియా పసిఫిక్ సృష్టి వ్యాకరణం ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. గాయని గీతామాధురి సూపర్ హిట్ గీతాలతో చేసిన సందడి అందర్నీ ఉత్తేజపరిచింది. స్త్రీల అణచివేత శ్రేయస్కరం కాదని హితబోధ చేస్తూ “డ్రామా జూనియర్స్” చిన్నారులు ప్రదర్శించిన డ్రామా కార్యక్రమం విజయంలో భాగమైంది. ఖుష్బూ, శ్రియ, రకుల్ ప్రీత్ సింగ్, నదియా, హన్సిక, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, క్యాథరిన్ థ్రెసా, రీతూవర్మ,  నివేదా థామస్, నీరజ కోన, గాత్రథారిణి, గాయని చిన్మయి శ్రీపాద తదితరులు అప్సర-2017 కార్యక్రమానికి తరలివచ్చిన అనేక ప్రముఖుల్లో కొందరు మాత్రమే. ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 23వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు ప్రసారం చేయగా ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించినట్టు జీ తెలుగు ప్రతినిధి వెల్లడించారు.
Zee Tv Apsara Awards (2)_wm

Advertisements

free to comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s