మే 5 నుండి జగపతిబాబు ‘సూర్యాభాయ్‌’ చివరి షెడ్యూల్‌ షూటింగ్‌

మే 5 నుండి జగపతిబాబు ‘సూర్యాభాయ్‌’ చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ 
ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు హీరోగా చిన్నారి ఆర్ట్స్‌, శ్రీ తిరుమల సినిమాస్‌ పతాకాలపై అర్జున్‌ వాసుదేవ్‌ దర్శకత్వంలో రాజేష్‌ చిన్నారి, ప్రతాప్‌ దండెం సంయుక్తంగా నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘సూర్యాభాయ్‌’. బి.వి. రామకృష్ణ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌. ఇప్పటి వరకు 3 షెడ్యూల్స్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ని మే 5 నుండి జరుపనున్నారు. ఈ షెడ్యూల్‌తో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలైలో చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు రాజేష్‌ చిన్నారి, ప్రతాప్‌ దండెం మాట్లాడుతూ..”అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు ఓ పవర్‌ఫుల్‌ పాత్రలో నటిస్తున్నారు. టైటిల్‌ ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో జగపతిబాబు గారి పాత్ర కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉంటుంది. పొలిటికల్‌ సెటైరికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం ఉంటుంది. సెంటిమెంట్‌, ఎమోషనల్‌, ఫ్యామిలీ డ్రామా అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఈ చిత్రంలో ఉన్నాయి. ప్రేక్షకులందరూ ఎంజాయ్‌ చేసే విధంగా ఈ చిత్రాన్ని దర్శకుడు అర్జున్‌ వాసుదేవ్‌ తీర్చిదిద్దుతున్నారు. ప్రదీప్‌రావత్‌, షాయాజీషిండే, సుమన్‌, సాయికుమార్‌, డి.ఎస్‌.రావ్‌, అర్చన ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ఓ ప్రముఖ హీరోయిన్‌ జగపతిబాబుగారి సరసన నటిస్తుంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని లావిష్‌గా తెరకెక్కిస్తున్నాము. స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఖచ్చితంగా సూపర్‌డూపర్‌ హిట్‌ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం. మే 5 నుండి జరిపే చివరి షెడ్యూల్‌తో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. జూన్‌లో పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను పూర్తిచేసి జూలైలో ఈ చిత్రాన్ని వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేశాం..”అన్నారు. 
ఓ ప్రముఖ హీరోయిన్‌ జగపతిబాబు సరసన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో షాయాజీషిండే, ప్రదీప్‌రావత్‌, సుమన్‌, సాయికుమార్‌, డి.ఎస్‌.రావ్‌, రాజారవీంద్ర, ఉత్తేజ్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, దిల్‌ రమేష్‌, అర్చన తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 
ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: బి.వి. రామకృష్ణ, సంగీతం: ఆనంద్‌, ఆర్ట్‌: జె.కె. మూర్తి, ఫైట్స్‌: నందు, పి.ఆర్‌.ఓ. జిల్లా సురేష్‌, నిర్మాతలు: రాజేష్‌ చిన్నారి, ప్రతాప్‌ దండెం, దర్శకత్వం: అర్జున్‌ వాసుదేవ్‌.

 

Advertisements

free to comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s