వైభవంగా కళాసుధ 19వ ఉగాది పుర‌స్కారాల వేడుక

వైభవంగా కళాసుధ 19వ ఉగాది పుర‌స్కారాల వేడుక 
 
శ్రీ కళాసుధా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఉగాది సందర్బంగా అందిస్తున్న సినిమా అవార్డుల వేడుక చెన్నైలోని మ్యూజిక్ అకాడమీ హాలులో ఘనంగా జరిగింది. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్య అథితిగా ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి  మండలి బుద్ధప్రసాద్, పారిశ్రామిక వేత్త రమేష్ దాట్ల, మువ్వా పద్మయ్య, విజయ చాముండేశ్వరి, నటుడు, మా అధ్యక్షుడు  శివాజీ రాజా, రఘుబాబు, ఆర్పీ పట్నాయక్, హీరో రోషన్, తదితరులు పాల్గొన్నారు. ఈ  సందర్బంగా పలువురు సినీ అవార్డు గ్రహీతలకు మండలి బుద్ధా ప్రసాద్   అవార్డులు అందచేసీ సత్కరించారు.  ఈ వేదికపై మహిళా రత్న అవార్డును ప్రముఖ పారిశ్రామిక వేత్త కరుణ గోపాల్ కు అందజేశారు. అనంతరం ఉప సభాపతి  మండలి బుద్ధా ప్రసాద్ మాట్లాడుతూ .. ఈ నవ వసంత అందరికి శుభాలను అందించాలని కోరుకుంటూ చెన్నై పట్టణంలో శ్రీ కళా సుధా సంస్థ .. సినిమా రంగానికి చెందిన అవార్డులు అందిస్తుండడం ఆనందంగా ఉంది. ఒక్క సినిమా వాళ్ళకే కాకుండా మిగతా రంగాల్లో కూడా నిష్ణాతులైన వారికీ అవార్డులు ఆడిస్తుండడం సంతోషదాయకం. ఇక ఏకగ్రీవంగా మా అధ్యక్షుడిగా ఎన్నికైన నటుడు శివాజీ రాజాను అభినందిస్తున్నాను. ఉగాది రోజున నాకెన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా కళాసుధ చెన్నై లో నిర్వహించే కార్యక్రమం అంటే చాల ఇష్టం . బేతిరెడ్డి శ్రీనివాస్ ఒక్కడే వన్ మెన్ ఆర్మీ గా ఈ అవార్డుల వేడుకను ఇంత గొప్పగా నిర్వహించడం ఆనందంగా ఉంది. ఇలాగె అయన మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ .. అవార్డులు అందుకున్న వారికి నా అభినందనలు తెలుపుతున్నాను అన్నారు. 
 
నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ .. ముప్పై ఏళ్ళక్రితం ఇక్కడే అవకాశాలను వెతుక్కుంటూ తిరిగిన రోజులు గుర్తొస్తున్నాయి. చెన్నై రావాలంటే చాలా ఆనందంగా ఉంటుంది. చెన్నై తో ప్రత్యేక అనుబంధం ఉంది నాకు. ఇక కళాసుధ పేరుతొ శ్రీనివాస్ గత పద్దెనిమి ఏళ్లుగా సినిమా కళాకారులను సన్మానించడం చాల గొప్ప విషయం. కళాకారులంటే అంటే ఆయనకు అంత ఇష్టం. ఉగాది రోజున ఈ అవార్డు వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉంది. కళాసుధ మరిన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను అన్నారు. 
 
ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ .. నేను దర్శకుడుగా తీసిన మనలో ఒకడు సినిమా విడుదల సమయంలో నోట్ల రద్దు రావడంతో సినిమా అందరికి చేరలేదు,  అది సమాజానికి పనికివచ్చే సినిమా అని అంటున్నాను.   అలాంటి సినిమా ను గుర్తించిన కళాసుధ ఉత్తమ సామజిక చిత్రంగా అవార్డు అందించడం ఆనందంగా ఉంది. బేతిరెడ్డి శ్రీనివాస్ అందిస్తున్న ఈ అవార్డును అందుకోవడం గర్వాంగా ఉంది అన్నారు. 
 
కళాసుధ అధ్యక్షులు బేతిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ .. గత 18 ఏళ్లుగా కళాసుధ సంస్థ సినిమా రంగంలోని వారికీ అవార్డులు అందిస్తున్నాం. ఉగాది రోజున జరుగుతున్నా ఈ 19 వ అవార్డుల వేడుకకు వచ్చిన మండలి బుద్ధా ప్రసాద్ గారికి, ఈ వేడుకలో పాల్గొన్న పలువురు ప్రముఖులకు నా సదర స్వగతం. మా సంస్థకు మీరిస్తున ప్రోత్సహం మరవాలేదని, అలాగే కళాసుధ అవార్డులు అందుకుంటున్న పలువురికి మా అభినందనలు అన్నారు. ఇక ఘనంగా జరిగిన ఈ వేడుకలో అవార్డులు అందుకున్న వారు  
ఆర్పి పట్నాయక్ ( ఉత్తమ సామజిక చిత్రం – మనలో ఒకడు) , 
రోషన్ ( ఉత్తమ నూతన నటుడు –  నిర్మల కాన్వెంట్ ), 
నందిత శ్వేతా ( ఉత్తమ నూతన నటి – ఎక్కడికి పోతావు చిన్నవాడా ), 
వంశీ పైడిపల్లి ( ఉత్తమ దర్శకుడు – ఊపిరి ), 
ఎం రాజా ( ఉత్తమ కథ – ధ్రువ ), 
పరశురామ్ – ( ఉత్తమ మాటల రచయిత- శ్రీరస్తు శుభమస్తు ), 
వి ఐ ఆనంద్ ( ఉత్తమ కథనం – ఎక్కడికి పోతావు చిన్నవాడా ),  
చైతన్య ప్రసాద్ ( ఉత్తమ పాటల రచయిత ), 
కె సి అమృత వర్షిణి ( ఉత్తమ గాయని – పెళ్లి చూపులు), 
చందు మొండేటి – ( ప్రత్యేక జ్యురి అవార్డు – ప్రేమమ్ ), 
ప్రత్యేక జ్యూరీ నటుడు – రాకేందు మౌళి, 
ఉత్తమ హాస్యనటుడు – రఘుబాబు తదితరులు ఈ అవార్డులు అందుకున్నారు.  
Advertisements

free to comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s