Advertisements
JUST IN

శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న‌ `డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌`

శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న‌ `డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌` 

ఆర్య నుండి సరైనోడు వ‌ర‌కు డిఫ‌రెంట్‌ చిత్రాల‌తో తెలుగు చిత్ర‌సీమలో స్టైలిష్ స్టార్‌గా త‌న‌దైన ముద్ర వేసుకున్న హీరో అల్లుఅర్జున్‌. తెలుగులో చిత్ర సీమ‌లోనే కాదు, మ‌ల‌యాళ సినీ పరిశ్ర‌మ‌లో కూడా త‌న‌దైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న బ‌న్ని హీరోగా , మాస్ ఇమేజ్ ఉన్న హీరోను వెండితెరపై హై పొటెన్షియ‌ల్‌తో ప్రొటేట్ చేయ‌డంలో స్పెష‌లిస్ట్ అయిన డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్.ఎస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌`.  ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్ మూవీ చేసిన హారీస్  సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ చిత్రంతో హ‌రీష్ సాయిధ‌ర‌మ్ తేజ్‌ను క‌మ‌ర్షియ‌ల్ హీరో చేశాడు. ఇలాంటి మాస్ యూత్ అండ్ ప‌వ‌ర్‌ఫుల్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ..స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కాంబినేష‌న్‌లో మూవీ అంటే ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇటు మెగా అభిమానులు, అటు ఇండ‌స్ట్రీ అంతా ఎలాంటి సినిమా రానుందోన‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.  స‌క్సెస్‌ఫుల్ నిర్మాత‌గా ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాత‌గా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. ఆర్య‌, ప‌రుగు వంటి సూప‌ర్ డూప‌ర్‌హిట్ మూవీస్ త‌ర్వాత అల్లుఅర్జున్, దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది.  రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్‌, బ‌న్ని కాంబినేష‌న్‌లోవ‌స్తోన్న మరో మ్యూజిక‌ల్ కాంబో ఇది. ఇలా ఇన్ని క్రేజీ కాంబినేష‌న్స్ అంతా ఒకే సినిమాకు కుద‌రడంతో.. సినిమా అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుండి సినిమాపై అంచ‌నాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. 

ఈ అంచ‌నాల‌ను మించుతూ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్‌. రీసెంట్‌గా విడుద‌లై ఈ సినిమా టీజ‌ర్‌కు ఆడియెన్స్‌ను ట్రెమెండస్ రెస్పాన్స్ వ‌చ్చింది. రీసెంట్‌గా అబుదాబిలో షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. శ్రీమ‌ణి రాసిన పాట‌ను దినేష్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీలో సాంగ్‌ను పిక్చ‌రైజ్ చేస్తున్నారు. సినిమా హైలైట్ పాయింట్స్‌లో ఈ సాంగ్ ఓ హైలైట్ అయ్యేలా ఈ సాంగ్‌ను తెర‌కెక్కిస్తున్నారు. బ‌న్ని డ్యాన్సులు గురించి ఇక ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌న‌క్క‌ర్లేదు. ఈ సాంగ్ అభిమానుల‌కు క‌నుల పండుగ‌లా ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ తెలియజేశారు.

ఈ చిత్రానికి ఫైట్స్‌:రామ్‌-లక్ష్మణ్‌, సినిమాటోగ్రఫీ: ఐనాక బోస్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటర్‌:  ఛోటా కె.ప్ర‌సాద్,  ఆర్ట్‌: రవీందర్‌, స్క్రీన్‌ప్లే: రమేష్ రెడ్డి, దీపక్‌ రాజ్‌ నిర్మాతలు: దిల్‌రాజు-శిరీష్‌, కథ, మాటలు, దర్శకత్వం: హరీష్‌ శంకర్‌.ఎస్‌.

duvvada jagannadham working stills

Advertisements
About naughtytollywood (2050 Articles)
INDIAN ENTERTAINMENT

free to comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: