ఆయుష్మాన్ భవ

ఆయుష్మాన్ భవ

ఈ నెల 15 న  `ఆయుష్మాన్ భ‌వ‌` మూవీ  క‌ర్ట‌న్ రైజ‌ర్ వేడుక‌!!

మారుతి టాకీస్- సి.టి.ఎఫ్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న `ఆయుష్మాన్ భ‌వ‌` చిత్రం ఈనెల 15వ తేదిన పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకోనుంది. `సినిమా చూపిస్త మావ‌`, `నేను లోక‌ల్` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన త్రినాధ‌రావు న‌క్కిన ఈ చిత్రానికి క‌థ అందిస్తున్నారు.  బాలీవుడ్ లో ప‌లు హిట్ సినిమాల‌కు సంగీతం అందించిన‌  మీట్ బ్ర‌ద‌ర్స్ ఈ చిత్రానికి  సంగీతం అందిస్తున్నారు. `చెన్నై ఎక్స్ ప్రెస్`, `దిల్ వాలే` వంటి హిట్ చిత్రాల‌కు ఛాయాగ్రాహ‌కుడిగా పనిచేసిన డూడ్లీ ఈ సినిమాకు కెమెరా మేన్ గా వ్వ‌వ‌హ‌రిస్తున్నారు. ఈ నెల 15న ప్రారంభం కానున్న సినిమా గురించి అదే రోజున  చిత్ర యూనిట్ మాధాపూర్ ఎన్ క‌న్వెన్ హాల్ లో  క‌ర్ట‌న్ రైజ‌ర్ వేడుకను నిర్వ‌హిస్తుంది.

ఈ సంద‌ర్భంగా  సి.టి.ఎఫ్ ప్ర‌తినిధి చ‌ర‌ణ్ తేజ్ మాట్లాడుతూ “ త్రినాధ‌రావు న‌క్కిన‌, డూడ్లీ వంటి టాప్ టెక్నిషీయ‌న్ల‌తో సినిమా తెర‌కెక్కుతోంది. అలాగే సీనియ‌ర్ రైట‌ర్స్ ప‌రుచూరి ప్ర‌ద‌ర్స్ ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే స‌మ‌కూరుస్తున్నారు. ఇంత మంది పెద్ద వాళ్ల‌తో పాటు, మారుతితో క‌లిసి ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. అందుకు ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా కృతజ్ఞ‌త‌లు తెలుపుతున్నా. 15వ తేదిన పూజాకార్య‌క్ర‌మాలు అనంత‌రం అదే రోజు సాయంత్రం 6 గంట‌ల‌కు టైటిల్ లోగో లాంచ్‌,  సాంకేతిక నిపుణుల‌ను ప‌రిచ‌యం చేస్తూ కర్ట‌న్ రైజ‌ర్ వేడుక చేస్తున్నాం. ఇలా సినిమా ప్రారంభం త‌ర్వాత క‌ర్టైన్ రైజ్ చేయ‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం` అని అన్నారు.

అలాగే ఈ క‌ర్ట‌న్ రైజ‌ర్ వేడుక‌లో మీట్ బ్ర‌ద‌ర్స్ సంగీతంతో అల‌రించ‌నున్నారు. ప్ర‌ముఖ హీరోయిన్ల డ్యాన్సుల‌తో వేదిక  మ‌రింత క‌ళ‌క‌ళ‌లాడ‌నుంది. ఈ వేడుక‌కు ప‌లువురు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు హ‌జ‌రు కానున్నారు.

Advertisements

free to comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s